

జనం న్యూస్. ఫిబ్రవరి 23. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని శ్రీ విష్ణు బి వి ఆర్ ఐ టి ఇంజినీరింగ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కళాశాలలో విజయవంతంగా ముగిసిన ఈ బాహా సే ఇండియా 2025 బగ్గిల పోటీలు. ఈ కార్యక్రమానికి. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ డాక్టర్ వి. బాలకిష్ట రెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి,(టి జి సి హెచ్ ఈ) హైదరాబాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కువ శాతం యువ జనాభా ఉందని తెలిపారు. ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ సెమీకండక్టర్ తయారీలో ఆవిష్కరణలకు ఉన్నాయని యువ ప్రతిభకు భారతదేశంలో చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలియపరిచారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మకం అందేలా చేయూతనిస్తాయని అన్నారు. ముఖ్య అతిథి సుఖ్మల్ జైన్, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పాల్గొని వారు మాట్లాడుతూ బాహా విష్టితను విద్యార్థులకు వివరించారు. మిస్టర్ సుఖ్మల్ జైన్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ బీపీసీఎల్ మా అసోసియేషన్ ద్వారా తదుపరి తరం ఆవిష్కర్తలకు చేయూత నిస్తామని తెలిపారు.
రవిచంద్రన్ రాజగోపాల్, వైస్ చైర్మన్, శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారు మాట్లాడుతూ తమ కళాశాలల్లో ఇటువంటి పోటీలకు నాంది పలుకుతూ దక్షిణ భారత్ దేశంలో రెండో సారి నిర్వహిచే అవకాశం మాకు దక్కినందుకు గౌరవంగా ఉందన్నారు. ఇటువంటివాటిని ఎల్లపుడు విద్యార్థులకు తరగతి గది అవతల పాట్యంశలను నేర్చుకొనేందుకు కృషి చేస్తామని తెలిపారు. బి వి రాజు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లకు మరు పేరుగా ఇంజనీరింగ్ విద్యానందు ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. బాల్రాజ్ సుబ్రమణియం, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, బాహా సే ఇండియా వారు మాట్లాడు బాహా ఎలా విద్యార్థులకు పయోగపడుతున్నది విద్యార్థులకు సూచించారు. రామనాథన్ సి మేనేజింగ్ డైరెక్టర్, ఆటోమోటివ్ టెస్ట్ సిస్టమ్స్ వారు మాట్లాడుతూ టెక్నాలజీ అప్లికేషన్స్ వివరాలను విద్యార్థులకు తెలియపరిచారు. 2007లో ప్రారంభమైనప్పటి నుండి, బాహా సే ఇండియా సింగిల్-కేటగిరీ కార్యక్రమాల నుండిబహుళ-కేటగిరీకి పెరిగిందని. ఈ బాహా సే ఇండియా యొక్క 10 అద్భుతమైన సంవత్సరాలు ఈ సంవత్సరం సాక్షిగా ప్రత్యేకమైనవని బాహా సే ఇండియా కార్యక్రమం ద్వారా చరిత్రలో జట్ల గరిష్ట భాగస్వామ్యం. థీమ్ ఫ్యూజన్ 4 ఫ్యూచర్ సాంకేతికత, వైవిధ్యం, స్థిరత్వం కనెక్టివిటీ యొక్క ప్రధాన స్తంభాలపై నిలుస్తుందని అన్నారు. ఎం బాజా (ఐ సిఇంజిన్) ఈ బాజా (ఎలక్ట్రిక్), హాబాజా (హెచ్ సి ఎన్ జి) ఏ బాజా (స్వయంప్రతిపత్తి)ఈ సీజన్ నిజంగా ఈ విలువలను ప్రతిబింబిస్తుందని అన్నారు, ఈ భాజా సే ఇండియా కార్యక్రమం నాలుగు-రోజుల ప్రదర్శనగా నిలిచిందన్నారు. అన్ని జట్ల విద్యార్థులను, పూర్వ విద్యార్థుల కమిటీలను, సాంకేతిక బృందలను, న్యాయమూర్తులను కలసి ఈ కార్యక్రమ వివరాలను వాటి ప్రాముఖ్యతను ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత ఆటోమోటివ్ ఈఎలక్ట్రికల్ వెహికిల్స్ గురుంచి తన అనుభవాలను విద్యార్థులతో కలిసి పంచుకున్నందుకు అభినందనలు తెలిపారు. అనంతరం డైనమిక్ కార్యక్రమాలను ప్రారంబించారు. 85 జట్ల నమోదుతో ప్రారంభమైన ఈ బాహా సే ఇండియా 2025 యొక్క నాలుగు రోజుల ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన ప్రయాణంలో చివరి రోజు ఆదివారంతో ముగిసిందని. భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీలో మరో మైలురాయినిగుర్తు చేస్తూఈరోజు ఉత్కంఠభరితమైన బగ్గీల పోటీలకు వేదికగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజీ అయినా బి వీ రాజు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వేదికగానిలిచింది.జట్లలో చాలా మంది ఎదురుచూస్తున్న ఎండ్యూరెన్స్ రోజు యొక్క ముఖ్యాంశం.51 బృందాలు సాంకేతిక తనిఖీని విజయవంతంగా సాఫీగా చేశాయని,వాటిలో 44 జట్లు మునుపటి కఠినమైన సవాళ్లను ఎదుర్కొని చివరి దశకు అర్హత సాధించాయని. పోటీలో 44 జట్లకు 4వ రోజున 4-గంటల ఎండ్యూరెన్స్ నిర్వహించామని అన్నారు. చివరికి ద్రోణాచార్య అవార్డు ఎంఐటి అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ కు చెందిన భీమాగౌడ్ పాటిల్, పూణేలోని కారు నంబర్ E47 దక్కించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో. బి వి ఆర్ ఐ టి కళాశాల చైర్మన్. విష్ణు రాజు. ఆదిత్య విశ్వం. ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే. శ్రీనివాస్ రెడ్డి. సుభాష్ రెడ్డి. కాంతారావు. బాపిరాజు. సురేష్. మల్లికార్జున్. వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
