

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు గ్రామీణ క్రైస్తవుల ఉత్తమమైన భక్తి ఉద్యమంతో ఏర్పడిన అత్యున్నక్షేత్రమే, ఎర్రకొండ రహదారి మాత పుణ్యక్షేత్రమని, అనేక మందికి స్వస్థత ఆశీర్వాదాలు అందిస్తూ, అత్యున్నత ప్రార్థనా క్షేత్రంగా భాసిల్లుతోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యడ్లపాడు మండల కేంద్రంలోని ఎర్రకొండ రహదారి మాత వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, బిషప్ చిన్నాబత్తిన భాగ్యరావు ఆశీర్వచనాలు తీసుకున్నారు. దాదాపు 70 ఏళ్ల క్రితం ఏర్పడిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన రహదారిమాత క్రైస్తవాలయం, కులమతాలకు అతీతంగా విరాజిల్లుతోందన్నారు. లోకరక్షకుని మాత అయిన మరియతల్లి ఆశీర్వాదాలు ప్రజలందరికీ లభించాలన్నారు. మూడురోజులుగా రహదారి మాత పుణ్యక్షేత్రంలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమాలు క్రైస్తవ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా రహదారిమాత క్షేత్ర నిర్వాహకుల్ని, బిషప్ లకు మాజీమంత్రి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన క్షేత్రనిర్వాహకులు, శాసనసభ్యులు పుల్లారావు ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానంతరం అక్కడ ఏర్పాటుచేసిన అన్నదానాన్ని మాజీమంత్రి ప్రారంభించి, క్రైస్తవ విశ్వాసులకు అన్నవితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కామినేని సాయిబాబు, రాఘవయ్య, ముత్తవరపు సురేష్, సీతారామయ్య తదితులున్నారు.