Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు జరిగిన పత్రిక సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నo శ్రీనివాసరావు మాట్లాడుతూ 26వ తేదీ బుధవారం చరిత్ర ప్రసిద్ధిగాంచిన చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కోటప్పకొండ దక్షిణామూర్తి స్వరూపమైన పరమశివుడి కోటప్పకొండ తిరుణాలను చిలకలూరిపేట నియోజకవర్గ చుట్టుపక్క ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవిస్తారని, ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తారని, వారందరూ స్వామివారిని భక్తితో సేవించుకొని మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణంలో జాగ్రత్తగా అందరూ సమయమనంతో ముందుకు పోవాలన్నారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని, ఆ పరమశివుని ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, గారు నాదెండ్ల మండల మైనార్టీ అధ్యక్షులు పఠాన్ నబీ ఖాన్, మాజీ ఓబీసీ పట్టణ ధ్యక్షులు సింగరేణి బాలయ్య,పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు, గారు మైనార్టీ మోర్చా మండలం ధ్యక్షులు పోతవరం సుభాని, సీనియర్ నాయకులు క్రియాశీల సభ్యులు మద్ది సుధాకర్, పట్టణ మైనార్టీ మోర్చా యువ నాయకులు సుభాని,తోపాటు గుమ్మ బాలకృష్ణ,జోలాపురం రాయుడు, సభ్యులు సాల్మన్, యువ నాయకులు అన్నపురెడ్డి వీరాంజనేయులు, షేక్ ఇమ్మమ్,9వ వార్డు నెహ్రూ నగర్ మోజేష్ పాల్గొన్నారు.