Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మున్సిప‌ల్ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు, ఏఐటీయూసీ ఏరియా కార్య‌ద‌ర్శి దాస‌రి వ‌ర‌హాలు కోరారు. సోమ‌వారం మున్సిప‌ల్ కార్యాల‌యం ఎదుట ఏఐటీయూసీ అనుబంధ ఏ పీ.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వ‌ర్యంలో స‌మస్య‌లు ప‌రిష్క‌రించాల‌ని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగ, కార్మికుల వేతనాల చెల్లింపు, పనుల అప్పగింత నిర్వహణ సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలని. ప్రైవేట్ కంపెనీ, ఏజన్సీలకు అప్పజెప్పొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పర్మినెంట్ కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ లో ఎన్కాష్మెంట్‌, మూడు డీఏలు సత్వరం విడుదల చేయాలని కోరారు. ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుకై గత సమ్మెలో నాటి ప్రభుత్వంతో అంగీకారమైన అగ్రిమెంట్ మేరకు వేతనాలు పెంచి ఇవ్వాల‌ని, జనాభా ప్రాతిపదికన కార్మికులను పెంచాలన్నారు. ఇంజనీరింగ్ ఒప్పంద సిబ్బందికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, గత 15 సంవత్సరాలుగా స్కూల్ స్వీపర్లకు వేతనాలు పెంచలేదని. సత్వరం వీరి వేతనాలు పెంచాలని కోరారు. ఏడాదికాలంగా పెండింగ్లో ఉన్న మరణించిన రిటైర్మెంట్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పనులు కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగ, కార్మికుల వలె ఔట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మికుల రిటర్డ్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని చెప్పారు. అనంత‌రం మున్సిప‌ల్ డీఈఈ షేక్ అబ్దుల్ ర‌హీం, మున్సిప‌ల్ శానిట‌రీ ఇన్సెపెక్ట‌ర్ ర‌మ‌ణ‌రావుల‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొమరగిరి చెంచయ్య, క్కులయ్య,అంజయ్య, జయ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.