

జనం న్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్. నేడు జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ గెలుపు కోసం బిజెపి బిఆర్ఎస్ కుట్రన్ చేస్తున్నదని మండిపడ్డారు. ఒక్క ఎమ్మెల్సీని కూడా నిలబెట్టలేని టిఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుందని వారికి మా పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నగా సమావేశంలో భాగంగా నిజాంబాద్ నగరంలోని భూమిరెడ్డి కన్వెన్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు కాంగ్రెస్ వచ్చిన కొన్ని నెలల్లోని 55 163 ఉద్యోగాలు ఇచ్చామన్నారు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతేనే మాకు ఓటేయాలని తెలిపారు. అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పట్టభద్రులకు బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డాడని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ బిజెపి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు బి ఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారాని ఈ సందర్భంగా గుర్తు చేశారు మన తెలంగాణ సాధనలో పట్టభద్రులే కీలకం..
బిఆర్ఎస్ కు 2024 లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేరని సీఎం గుర్తు చేశారు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలబెట్టే స్తోమత లేదన్నారు తెలంగాణలో పట్టభద్రులే కీలకపాత్ర పోషించారని పదేళ్ల కాలంలో టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల ఉసురు పోసుకుందని విమర్శించారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ కార్యక్రమాన్ని నెలకొల్పి యువతను మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన నికిత జరిగినకు డిఎస్పి పదవి ఇచ్చి గౌరవించామని తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రికెటర్ సిరాజుకు కూడా గ్రూప్ వన్ కేడర్ ఉద్యోగం ఇచ్చామని పేర్కొన్నారు ఇవన్నీ పట్టబద్రులు ఆలోచించాలని రైతులకు రుణమాఫీ చేశామని సన్నబడ్లు పండించిన రైతులకు బోనాసి ఇచ్చామని గొప్ప అలీ సాగర్ అభివృద్ధి చేశామని ఇవన్నీ నిజమైతేనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేయాలని కోరారు కార్యక్రమంలో పిసిసి చీప్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. మంత్రులు జూపల్లి కృష్ణారావు. శ్రీధర్ బాబు.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ హలీ. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి. భూపతిరెడ్డి.మదన్మోహన్రావు. నాగరాజు. ఎండీసీ చైర్మన్ ఇరవత్రి అనిల్. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. ఉర్దూ చైర్మన్ తహర్బిన్ .తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి. నూడ చైర్మన్ కేశవేణు.తదితరులు పాల్గొన్నారు.