Listen to this article

జనం న్యూస్ 24 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో ఎస్సీ కాలనీలో గండు మోహన్ దాస్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి అంత్యక్రియల కొరకై గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీవాసులు ఇంటింటికి రెండు వందల రూపాయలు వేసుకొని వారికి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇకనుంచి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎవరు చనిపోయిన ఎస్సీ వాడలో ప్రతి ఒక్కరు ఇంటింటికి 200 రూపాయలు వేసుకొని చనిపోయినటువంటి వారి కుటుంబానికి హార్దిక సాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్ మరియు గండు రవికుమార్, సి జనార్ధన్, గండు రాధాకృష్ణ, ఈ సుధాకర్, గండు మాణిక్యం, గ్రామ పెద్దలు పాల్గొని వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది.