

జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూర్ నగరం.ఉమ్మడి కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సి ఎన్నికల్లో భాగంగా చంద్రశేఖర్ కాలనీలోని రీజినల్ లైబ్రరీలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాదు జిల్లాకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. జాబ్ క్యాలండర్ ధ్వరా ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలలో నిజామాబాదు యువతకు ఎన్ని ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించారో సమాధానం చెప్పాలన్నారు, నిరుద్యోగులకు ఎంత మందికి 4వేల భృతి ఇచ్చారో, ఎంత మంది నిజామాబాదు ఆడపడుచులకు 2500 ఇచ్చారో, ఎంత మంది 18 సం” నిండిన ఆడబిడ్డలకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఎన్ని ఇచ్చారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. 6 వేల కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయి కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువులకు దూరం అయ్యే దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించించదని మండిపడ్డారు.అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ దేవుళ్ళపైన ప్రమాణాలు చేసి ఇచ్చిన హామీలను ఏ గంగలో కలిపారని ప్రశ్నించారు, సిద్దుల గుట్ట మీద ఒట్టు పెట్టి ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ మొఖం పెట్టుకొని నిజామాబాదుకు ఓటు అడగటానికి వచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.తెలంగాణ రాష్ట్రాసాధనకు అమరులైన ఉమ్మడి నిజామాబాదు జిల్లా ఎన్ని అమరుల కుటుంబాలకు 25 వేలు, ఉపాధి అవకాశాలు కల్పించారో, ఎంత మంది నిజామాబాదు జర్నలిస్ట్ సోదరులకు ఇందిరమ్మ ఇండ్లు, వారి సంక్షేమనికి ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశ నిరుద్యోగుల తరుపున మండలిలో ప్రశ్నించే గొంతు వినపడాలంటే బిజెపి బలపరిచిన పట్టభద్రుల అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, మండల అధ్యక్షులు ఆనంద్ రావు, బీజేపీ నాయకులు వినోద్,మాస్టర్ శంకర్,గంగాధర్, మఠం పవన్, ఆనంద్,సాయి ప్రవీణ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.