

సబ్ టైటిల్:- 30 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు జనం న్యూస్ 24 ఫిబ్రవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెంబర్-1 లో 1994-95 సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 30 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు.శంషాబాద్ ఫామ్ హౌస్ లో కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు.మృతిచెందిన కొందరు తోటి మిత్రులకు మౌనం పాటించి సంతాపం తెలిపారు. మిత్రులు అందరూ కలిసి ఉల్లాసంగా గడిపారు. పూర్వపు మధురస్మృతులను నెమరు వేసుకున్నారు. ఇలాంటి కలయికలు మరెన్నో జరగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.