Listen to this article

నవాబుపేట 11 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కేపీఎల్ టోర్నమెంట్ మూడవరోజు కొనసాగుతున్న సందర్భంగా శనివారం టాస్ వేసి కొనసాగించిన నవాబుపేట ఎస్ఐ విక్రమ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల లో రాణించాలని మానసిక శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు నిరంతరం క్రీడల ఆడడంతో ఆరోగ్యంగా ఎన్నో రోగాలకు దూరం అవుతాయని తెలిపారు,మొదటి మ్యాచ్లో రాయల్ ఏలెవెన్ పై పవర్ హిటర్స్ గెలుపొందారు, రెండో మ్యాచ్ లో రాయల్ రేంజర్స్ పై సూపర్ స్టైకర్స్ గెలుపొందారు, మూడో మ్యాచ్లో రన్ మేకర్స్ పై పవర్ హీటర్స్ గెలుపొందారు ఈ సందర్భంగా కేపీఎల్ టోర్నీ ఏర్పాటుచేసిన ఆర్గనైజర్ల ను అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సౌజన్య రఘు గుప్త, జిల్లా అధ్యక్షులు వాసు యాదవ్, మాజీ ఉపసర్పంచ్ నరసింహ చారి, కోట్ల గోపాల్ ,కృష్ణయ్య , గ్రామ యువకులు క్రీడాకారులు పాల్గొన్నారు