Listen to this article
  • జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేత..
  • పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్..

జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన పి డి ఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ,ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యా పూర్తిగా వ్యాపారమయమైంది. గల్లి గల్లికి మోడల్ స్కూల్స్,ఈ టెక్నో , ఫౌండేషన్ ,ఈ-టెక్నో, డిజీ, డిసిన్,ఐఐటి ఫౌండేషన్, సివిల్స్ లాంటి తోక పేర్లు తగిలించుకొని యదేచ్చగా లక్షల్లో ఫీజులు వసూళ్లకు పాల్పడుతుంటే సంబంధిత విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు.ఒకే పాఠశాల పేరుతో సబ్ క్యాంపస్ లను కనీస వసతులు లేకుండానే పాఠశాలలను ప్రారంభిస్తున్నారన్నారు . ఉపాధ్యాయ అర్హత లు లేకుండానే టీచర్లుగా,నియమించుకుంటున్నారా ని, రేకుల షెడ్ల నుండి మొదలుకొని, అప్ స్టేర్ బిల్డింగ్ లలో తరగతి గదులను నిర్వహిస్తున్నారన్నారు . ఈ రెండు విద్యా నియమాలకు విరుద్ధమైనవి, విద్యార్థులకు ప్రమాదకరమైనవి,విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా త్రాగడానికి నీరు, వాష్ రూమ్స్, తరగతి గదులలో ఫ్యాన్లు, వెలుతురు లేకుండానే చీకటి గదుల్లో వేలాది మంది ద్యార్థులను విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అని తెలిపారు.విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాల పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ నాసీ రకమైన విద్యని అందిస్తూ వేలల్లో , లక్షల్లో ఫీజులను విపరీతంగా దండుకుంటు,మరోపక్క విద్యా సంవత్సరం ముగించక ముందే పాఠశాలు, చట్ట విరుద్ధంగా కరపత్రాలు,బ్యానర్లు,యాడ్స్ తో ప్రచారం చేస్తూ టీచర్స్ ని, కొంతమంది పిర్ ఓ, లను ఏర్పాటు చేసుకొని అడ్మిషన్ క్యాంపియన్ చేయాలంటూ పంపిస్తున్నారని, వివరించారు.దీనిని పి డి యస్ యూ విద్యార్థి సంఘం తరుపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నా రు . తక్షణమే విద్యాశాఖ అధికారులు,పేరెంట్స్ ప్రమేయంతో ఫీజులు నిర్దేశించాలని, ప్రతి ప్రైవేట్,కార్పొరేట్ పాటశాలల్లో పేరెంట్స్ కమిటీ లు నియమించాలని, ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్న పాఠశాల చర్యలు తీసుకోవాలని పి డి యస్ యూ గా విజ్ఞప్తి చేస్తున్నాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్, నాయకులు పల్లవి, ,వైష్ణవి ,వెన్నెల తదితరులు పాల్గొన్నారు.