

కంగ్టి లో దళిత బందు పథకానికి అందించాలని దళితుల నిరసన ర్యాలీ దళితులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే
జనం న్యూస్,ఫిబ్రవరి 24,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో కంగ్టి మండలానికి చెందిన వివిధ గ్రామాల దళితబంధు లబ్ధిదారులు కంగ్టి మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో సోమవారం మహా ధర్నాను నిర్వహించారు.ధర్నా నిర్వహించిన దళిత బంధువులకు సంఘీభావం తెలిపిన మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి, ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ఆదుకున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. దళిత సహోదరులకు ఉన్నతంగా బ్రతికే కొరకై దళిత బంధువును అమలు చేసిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ దళిత కుటుంబాలకు 739 లబ్ధిదారులకు శాంక్షన్ చేయించడం జరిగిందని అన్నారు.సంక్షన్ చేయించి 3లక్షల రూపాయలు గత తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,ద్వారా కలెక్టర్ అకౌంట్ లో జమచేయించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రౌండింగ్ చేయించక పోవడంద్వారా దళిత కుటుంబాలు ధర్నా చేయడం జరిగిందని అన్నారు.ఈ ధర్నాకు సంగీభావం తెలిపిన ఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు విశ్వనాథ్, మాజీ సర్పంచ్ కృష్ణ, దళిత బంధు లబ్ధిదారులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.