

జనం న్యూస్ ఫిబ్రవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి : మేము అధికారం లో వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరణ చేస్తాం అన్న ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం తక్షణమే అములు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణకార్మిక సంఘం ఏఐటీయూసీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆర్డీవో ఆపీస్ వద్ద ధర్నా నిర్వహించి ఏ ఓ సుధాకర్ కు వినతిపత్రం అందచేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ . గత వై సిపి ప్రభుత్వ హయాంలో జీఓ నెంబర్ 17ను ప్రవేశపెట్టి సంక్షేమ బోర్డు నుంచి రూ.1200 కోట్ల నిధులు దారి మళ్లించి సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్డీఏ కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే వెంటనే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తామని, పెండింగ్లో ఉన్న క్లెయిములకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది మాసాలు అయినప్పటికీ ఇంతవరకునిర్మాణకార్మికులు సంక్షేమ బోర్డుకోసం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు భవన కార్మికుల సంక్షేమ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు కేటాయించాల్సిన అవసరం లేదని, బిల్డర్స్, ప్రభుత్వ కట్టడాల వద్ద వసూలు చేసే వన్ పర్సెంట్ సెస్ ద్వారానే సంక్షేమ బోర్డు అమలు చేసి కార్మికులను ఆదుకోవచ్చనితెలియజేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును పునః ప్రారంభించి బోర్డు ద్వారా పధకాలు అములు చేయాలి, పెండింగ్లో ఉన్న 46 వేల క్లైములకు నిధులు మంజూరు చేసి, 55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి రూ.6 వేల పెన్షన్ మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, పెరిగిన సిమెంట్, ఐరన్, కలప తదితర ధరలు తగ్గగించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బోర్డు సొమ్మును ఇతర పధకాలు కు మల్లించ రాదు అని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో చిన్ని సత్తిబాబు, పల్ల నర్సిగరావు, మొల్లి చిలుకు, చిన్ని కొండ బాబు,చొప్ప రాము, చిన్నబాబు, డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు //