

జనం న్యూస్ ఫిబ్రవరి 24 నడిగూడెం నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామం లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు పగిల ఉపేందర్ తెలిపారు.అధ్యక్షులుగా అమరబోయిన రమేష్, ఉపాధ్యక్షుల రామిని నర్సిరెడ్డి, కార్యదర్శిగా బూసరాజు కార్తీక్, సహాయ కార్యదర్శిగా పప్పుల అశోక్, కోశాధికారిగా కుంచం నాగేంద్రబాబు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సోమగాని రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల శ్రీనివాస రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.