Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 24 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) సోమవారం రోజున బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్ – ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వూట్కూరి మద్దతుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుట్ట గిరీష్ గౌడ్ జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షులు ఇమ్రోజ్ యూత్ నాయకులతో కలసి ప్రచారం చేశారుఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యోగేష్, యువజన కాంగ్రెస్ నాయకులు అజీమ్, అబ్బు, సతీష్ పటేల్, సాహిల్, శ్రీనివాస్, మునీర్, రమేష్, రాము రాథోడ్,తదితరులు పాల్గొన్నారు.