Listen to this article


జనం న్యూస్ ఫిబ్రవరి 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకుసోమవారం రోజునా పీఎం శ్రీ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎలాంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందించుకోవాలి, భవిష్యత్తును ఏ విధంగా నిర్మించుకోవాలి, మొదలైన అంశాలను ఇంపాక్ట్ ఫౌండేషన్ సభ్యురాలు వజ్జ నవనీత మేడం చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎవరి చేతుల్లో వారి భవిష్యత్తు ఉంటుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని, చిన్న చిన్న ఉదాహరణల ద్వారా కథల ద్వారా విద్యార్థులకు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ, ప్రేరణ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందింప చేయడం, వారికంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, తెలపడం జరిగింది. విద్యార్థులకు చక్కని మోటివేషన్ చేసిన నవనీత మేడం అభినందించి పాఠశాల తరఫున సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీ మతి నాగరాణి పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్,ప్రసాద్,పవన్,రాజశేఖర్,రాజ నరసయ్య,రాజేందర్, విజయ్ కుమార్ కే .శ్రీనివాస్,గంగాధర్,ప్రవీణ్ శర్మ, కాల శ్రీనివాస్,గంగమోహన్,ట్వింకిల్,సమత,జ్యోతి, కోమలి తదితరులు పాల్గొన్నారు