

తడికల శివకుమార్ బిఎస్పీ జిల్లా ఇన్ చార్జ్,భద్రాచలం నియోజకవర్గం అదనపు ఇంచార్జి
పిబ్రవరి 24 జనంన్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంనియోజకవర్గ అదనపు ఇన్ చార్జ్ తడికల శివకుమార్ మాట్లాడుతూ దళితుల భూములకు రెవిన్యూ యంత్రంగం కల్పించాలని అన్నారు వాజేడు మండలంలోని పలు పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వాజేడు వచ్చిన ఆయనకు అరుణాచల పురం దళితులు కలిసి మాకు ఉన్నటువంటి భూమి వాజేడు మండలం లో అరుణాచల పురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 21 లోగల 8.60 తమ భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అడిగితే మేం ఆదివాసులమని బెదిరిస్తున్నారని అందుకు రెవిన్యూ సర్వేయర్ మద్దతుగా నిలుస్తున్నాడని పిర్యాదు చేశారు. ఈ విషయమై సంఘటనా స్థలానికి స్వయంగా బి ఎస్పీ పార్టీ తడికల శివకుమార్ పార్టీ శ్రేణులతో కలిసి వెల్లి పరిశీలించి ఈ విషయాన్ని తక్షణమే భాదిత దళిత కుటుంబ సభ్యుల వ్యవసాయ భూమికి రక్షణ కల్పించాలని కోరారు,ఆక్రమించేందుకు ప్రయత్నం చేసిన సదరు వ్యక్తులపై పోలీసు కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,16,17,21 ప్రాథమిక హక్కుల ప్రకారం ,అసైండ్ మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం దళితుల కు అంటరానితనం నిర్మూలన కొరకు కేటయించ బడిన భూములను ప్రయివేటు వ్యక్తులకు అధికారులు ధారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దళితులైన సప్పిడి సమ్మయ్య,సప్పిడి రాంబాబు,కుమ్మరి సారమ్మ,సప్పిడి సాంభ శివరావు ,సప్పిడి నాగరాజు,అను వ్యక్తుల సాగులో ఉన్న సర్వే నం 21విస్తీర్ణం 8.60 సెంట్ల గల సాగుభూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేసిన చిక్కుడు బుజంగరావు అను వ్యక్తి ని అంధుకు సహకరించేలా వ్యవరించిన సర్వేరు పై మండల తహసీల్దార్ విచారణ జరిపి తగు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని లేని యెడల బాధితదళిత ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమం న్ని నిర్వయిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షులు కొండా చరణ్, ఉపాధ్యక్షులు కుమ్మరి రాంబాబు నియోజకవర్గం సోషల్ మీడియా ఇంచార్జి జనగం కేశవరావు, సప్పిడి సాంబశివరావు,రాంబాబు, యేసు, బాబు తదితరులు పాల్గొన్నారు