

జనం న్యూస్ 24ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ నిరుద్యోగ యువతీ (స్త్రీ లకు) సువర్ణావకాశం రేపు అనగా 25.02.2025 తేదీన (మంగళవారం)..ఆసిఫాబాద్ నియోజకవర్గం శాసనసభ్యురాలు కోవా లక్ష్మి ఆధ్వర్యంలో జరగబోయే ఈ మెగా జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎంఎల్ఏ వెల్లడించారు. భారతదేశంలోనే ప్రముఖ కంపెనీలలో అర్హత కలిగిన (SKSS ఫాక్స్ కాన్, ఆపిల్ సంస్థ) విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధి పరిసర ప్రాంతాల్లో ఉండే విద్యార్థినీలు రేపు ఉదయం 10 గంటలకు ఆసిఫాబాద్ ప్రేమలా గార్డెన్ లో హాజరై, ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. కుటుంబాలలో అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, కడుపు కట్టుకొని మరీ ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించి, ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితులు కానరాక, భవిష్యత్తు బతుకుల మీద ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న విద్యార్థినీలకు (స్త్రీలకు) ఇది సువర్ణ అవకాశం.