

జనం న్యూస్;24 ఫిబ్రవరి సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;కృష్ణంవందే జగద్గురుమ్ హితీపరిషత్ సభ్యులు మర్పడ్గ విజయదుర్గమాతకు సమర్పిస్తున్న పద్య కదంబ సంకలన పుస్తకం విబుధసంసర్గ మర్పడ్గ విజయదుర్గ మకుటంతో శ్రీసంతానమల్లికార్జున స్వామి, విజయదుర్గామాత దేవాలయముల ర్వహణమండలి సౌజన్యంతో ప్రచురితమైన సంకలనమును నేడు 25-02-2025 న మర్పడ్గ క్షేత్రంలో విష్కరింపబడుతుందని కృష్ణంవందే జగద్గురుమ్ అధ్యక్షులు సింగీతం నర్సింహారావు అన్నారు. క్షేత్ర నిర్మాత డా -చెప్పెల రినాథశర్మ విశ్రాంత ఉపన్యాసకులు, దేవీ ఉపాసకులు, సిద్ధిపేట జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి , మున్సిపల్ కమీష్నర్ అశ్రిత్ కుమార్, చేతులమీదుగ పుస్తకవిష్కరణ జరుపబడుతుందన్నారు. ప్రముఖ అవధానులు ముత్యంపేట గౌరీశంకరశర్మ, బండకాడి అంజయ్య గౌడ్, మంచినీళ్ళ సరస్వతీరామశర్మ, ఉండ్రాళ్ళ రాజేశం, వర్కోలు లక్ష్మయ్య, కట్టారంజిత్ తదితరులు హాజరవుతారన్నారు. ఇట్టి కార్యక్రమానికి సాహితీ స్థలబాధ్యులు, కవులు, రచయితలు విచ్చేసి సభను విజయవంతం చేయాలన్నారు.