

జనం న్యూస్ 24 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి జైపూర్ మండలం లో ఉన్న కుందారం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది.అటవీ అభివృద్ధి సంస్థ( టీజీ ఎఫ్ డీసీ )కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో సంచరించిన పెద్ద పులి పాదముద్రలను సోమవారం మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్బంగా జైపూర్ క్రాస్ రోడ్ నుంచి ఆరెపల్లి ఘటం మీదుగా కుందారం వరకు ఉన్న అటవీ ప్రాంతం మార్గంలో ఎవరూ వెళ్ళవద్దని చెప్పారు. కుందారం సమీపంలో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లు,అటవీ ప్రాంతం లో ఈ పెద్దపులి సంచరిస్తోంది.సమీప పంట పొలాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్బంగా మంచిర్యాల, చెన్నూర్ రేంజ్ లకు అటవీ సెక్షన్,బీట్ అధికారులు భగవంత్ రావు,భీమయ్య ,సతీష్, శ్రీధర్, వాచర్లు సాయికిరణ్, రాకేష్ లు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించిన ప్రాంతంలో తిరుగుతూ దానికి ఎలాంటి అపాయం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టారు