

జనం న్యూస్ ఫిబ్రవరి 25: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో శ్రీ కాశీ మహేశ్వర శ్రీ గోవిందంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం మహోత్సవము సందర్భంగా సోమవారం మొదటిరోజు దేవారం వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు,పాశం భద్రాచలం హనుమాన్ పతాక ఆవిష్కరణ చేసి 47 వ వార్షికోత్సవ ఉత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. దేవాలయ అధ్యక్షుడు ఇనుగుర్తి వీరాచారి మాట్లాడుతూ.. 26 వ తారీకు బుధవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు శ్రీ జగత్ జనని గోవిందామ పరమ పవిత్ర మూర్తి శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి కళ్యాణ మహోత్సవం జరుగునని,27 వ తారీకు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అన్న ప్రసాద వితరణ జరుగును అని తెలిపారు.ఈ శుభ కార్యమును పెద్ద ఎత్తున భక్తులు వచ్చి విజయవంతం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త ముత్యాల సత్యనారాయణ, ప్రధానార్చకులు బాణాల లక్ష్మణ చార్యులు , అనంతోజు సుభాష్ చంద్రబోస్, ముత్యాల కృష్ణ, వేలాది వెంకటప్ప చారి, బంగారపు శ్రీనివాస్, ముత్యాల వెంకటేశ్వర్లు, ఎలక ప్రతాపరెడ్డి, ముత్యాల మంగమ్మ, సంధ్య, గోవిందమ్మ, సుజాత, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
