

గతంలో నష్టపరిహారం పెంచాలని ధర్నా చేసిన నాయకులపై కేసు నమోదు
నవాబ్ పేట11 జనవరి 25 జనం న్యూస్ :- ఉదండాపూర్ రైతుల పక్షాన మద్దతుగా నిలబడి ధర్నా చేసిన కేసులో నేడు కోర్టుకు హాజరు వైనారు.2018 సంవత్సరంలో ఉదండాపూర్ బాధితులకు నష్టపరిహారం పెంచాలని ధర్నా చేసిన నాయకులపై అప్పటి కెసిఆర్ ప్రభుత్వం కేసు నమోదు చేశారు అని అట్టి కేసులో ప్రస్తుత నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి,రాంప్రసాద్, నిత్యానందం మహమ్మద్ ఖాజా మైనోద్దీన్, రామ్ మోహన్ ఖయ్యుమ్ నందా కిషోర్ ఉమాయున్ తదితరులు శుక్రవారం కోర్టుకు హాజరు అయినారు.రైతుల పక్షాన నిలబడి న్యాయబద్ధంగా ధర్నా చేసినందున్న అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉదండాపూర్ రైతులకు నష్టపరిహారం పెంచాలని, మాపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అదేవిదంగా ముంపు రైతులకు నాయ్యం చేయాలనీ ప్రభుత్వవాన్ని కోరారు.