Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 24 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ మెదక్-నిజామాబాద్- దిలాబాద్- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా.. ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్ లో బిచ్కుంద,జుక్కల్,మద్నూర్,డోంగ్లి మండలాల నాయకుల రివ్యూ మీటింగ్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “అల్ఫోర్స్” వూట్కూరి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని క్యాడర్ ను ఆదేశించారు.. పట్టభద్రుల లిస్ట్ తీసుకొని వారి ఇంటికి వెళ్లి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి మరియు ఉద్యోగ నియామకాలు తదితర అంశాలను వారికి వివరించి.. ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరాలని సూచించారు..