

జనం న్యూస్ 25 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీను వేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా ప్రతినిధి సూరప్పడు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సంఘ నాయకులతో కలిసి సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు ఉన్నారని ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలన్నారు. తొలి విడతగా లక్ష లోపు ఉన్న బాధితులకు చెల్లింపులు చేయాలన్నారు.