

జనం న్యూస్ 25 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మా భూములకు శాశ్వత భూ హక్కులు కల్పించాలని విజయనగరం కలెక్టరేట్ వద్ద రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. కొత్తవలస మండలం, చిన్నిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో వంశ పారంపరంగా సాగు చేస్తున్న 12 గ్రామాల రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నో ఏళ్ల నుంచి భూ సమస్యలు ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.