Listen to this article

జనంన్యూస్. 25. నిజామాబాదు. సిరికొండ. సమస్యల సడకపై ఆదర్శ పాఠశాల.. రూరల్ ఎమ్మెల్యే జరదేకో. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాల. కు మండల కేంద్రం నుండి 1/2 కిలోమీటర్ దూరంలో గలదు ఇక్కడికి చేరుకోవడానికి ప్రస్తుతం ఆర్టీసీ బస్సు నడుపుతుంది. కొందరు పిల్లలు వారి సొంత ఖర్చులతో ఆటోలో షేరింగ్ పెట్టుకుని వస్తారు. అయితే అసలు సమస్య అక్కడే ఉంది. రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ పొదలు. చెట్లు . పాడుబడ్డ బావి. చూడడానికి కొంచెం భయంకరంగానే ఉంటాయి. మరియు రోడ్డుపై గుంతలు. రెండు వాహనాలు ఎదురుపడితే ఇంకా ఎన్నో ఇబ్బందులు అసలు రోడ్డు వెడల్పే ఉండదు. సాయంత్రం రోడ్డు పక్కనే మద్యం ప్రియులు ఇలాంటి ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకుంది ఆదర్శ పాఠశాల రేపటి మన పిల్లల భవిష్యత్తు కొరకు దీనిని మనమే కాపాడుకుందాం.
స్థానిక మండల నాయకులు దీనిపై శ్రద్ధ తీసుకొని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. దృష్టికి తీసుకుపోయి ముళ్ళ పొదలు తొలగించి రోడ్డు గుంతలు పూడ్చేసి. బావి వద్ద ప్రమాద సూచిక ఏర్పాటు చేయాలని. కోరుతున్నారు. ఉపాధి హామీలో కూడా రోడ్డును బాగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. స్థానిక మండల అధికారులు కూడా దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది. సాయంత్రం టైములో ఈ రోడ్డుపైన పోలీసులు పెట్రోలింగ్ చేస్తే కూడా ఆకతాయిలకు అడ్డుకట్ట వేసినట్టుగా ఉంటుంది.