

శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు జనం న్యూస్ ఫిబ్రవరి 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చండూరు గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు స్వస్తి శ్రీ కృతినామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి తేదీ 26 బుధవారం రోజున మహాశివరాత్రి ఉపవాస దీక్షలు మరియు అభిషేకాలు మరియు సాయంత్రం ఐదు గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు రాత్రి 8 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం తర్వాత శ్రీ రామలింగేశ్వర స్వామికి తెల్లవారుజామున 4 గంటల వరకు అభిషేకాలు జరుగును రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు భజన కార్యక్రమాలు జరుపబడును తేదీ 27 గురువారం రోజు ఉదయం 11 గంటలకు అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం ఐదు గంటలకు జాతర బండ్లు తిరుగును తేదీ 28 శుక్రవారం పొద్దున పాచి పనులు తిరిగి రాత్రి 7 గంటలకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడును మరియు తేదీ ఒకటి శనివారం రోజున పాచిరతం తిరుగును రాత్రి 8 గంటలకు లంకా దహన కార్యక్రమం జరుగును కావున గ్రామ ప్రజలందరూ మరియు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమాలు జరుగునని ఆలయ అర్చకులు మురళీధర్ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి