

జనం న్యూస్ 25 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా రహదారుల భద్రత కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు అండ్ సేఫ్టీ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రావ్య అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ప్రమాదం జరిగిన గంటలోపు (గోల్డెన్ అవర్) లో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లినవారికి రూ.5000 నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేస్తామన్నారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించాలన్నారు.