

ఎఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం జనం న్యూస్ 25 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అధికారం కోసం ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కాళ్ళు కడిగి, శాలువాలు కప్పి ఎంతో ప్రేమాభిమానాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన పాలకులకి గద్దెనెక్కినాక కార్మికుల గోడు వినపడదా..? మున్సిపల్ కార్మికులతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారా..? అని ఎఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఎ.పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటీయుసి అనుబంధం ) ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు నేతృత్వంలో విజయనగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చెప్పట్టీ అక్కడ నుంచి గంట స్థంభం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం నిర్వహించి మరల అక్కడ నుంచి మున్సిపల్ కార్యాలయంకి చేరుకుని అసిస్టెంట్ కమిషనర్ గార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ వైసిపి ప్రభుత్వ హయాంలో ఆరు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు సమ్మె చేయగ అప్పటి ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కారానికి ఒక కమిటీ వేసి జాప్యం చేసింది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి 8 మాసాలు గడిచిన ఆ హామీలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అడిగే ప్రభుత్వం అప్కొస్ అని ఔట్సోర్సింగ్ సంస్థను తెచ్చారన్నారు. అదేదో గుడ్డి మెల్ల అన్నట్టుగా సమయానికి జీతాలు చెల్లిస్తుందిలె అని అనుకుంటున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు అప్కొస్ ను రద్దు చేసి కమిషన్లుకి కక్కుర్తి పడి ప్రైవేటు కాంట్రాక్టు ఏజెన్సీల కోరలకి మున్సిపల్ పారిశుధ్య కార్మికులను బలి చేస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి ఇష్టానుసారంగా కార్మిక వ్యతిరేక సంస్కరణలు చేసి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో ఆలోచన చేయకపోతే సమస్యల పరిష్కారం కోసం ఎఐటీయుసి దశల వారీగా పోరాటాలు చేస్తుందనీ అశోక్ హెచ్చరించారు.
ఎస్. రంగరాజు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగ, కార్మికుల వేతనాల చెల్లింపు పనుల అప్పగింత నిర్వహణ సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలి. ప్రవేట్ కంపెనీ / ఏజన్సీలకు అప్పగించొద్దు అని డిమాండ్ చేశారు. అవుట్బోర్సింగ్ పారిశటర్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. పర్మినెంట్ కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సెరిండర్ లీవ్ లు, ఎన్క్యాష్మెంటు మరియు మూడు డి.ఏ.లు సత్వరం విడుదల చేయాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుకైత సమ్మెలో వాటి ప్రభుత్వంతో అంగీకారమైన. అగ్రిమెంట్ మేరకు వేతనాలు పెంచాలన్నారు. ఏడాదికాలంగా పెండింగ్లో ఉన్న మరణించిన రిటైర్మెంట్ కార్మికుల స్థానలలో వారి కుటుంబ సభ్యులకు పనులు కల్పించాలన్నారు. డ్రైవర్లుకు జీ.వో అమలు చేసినప్పటికి నుండి జీతాలు చెల్లించాలి. రెండు నెలలు బకాయలు చెల్లించాలి. జి.ఓ.నెం. 151 ప్రకారం సూపర్ వైజర్లుకు జి.ఓ. అమలు చేసిన నాటి నుండి వారికి వేతనాలు పెంచుతూ ఎరియర్స్ కూడా ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికన కార్మికులను పెంచాలి. ఇంజనీరింగ్ మరియు పారిశుధ్య సిబ్బందికి సంక్షేమ పధకాలు వర్తింపజేయాలి. గత 15 సంవత్సరాలుగా స్కూల్ స్వీపర్లకు వేతనాలు పెంచలేదు. సత్వరం ఈరి వేతనాలు పెంచాలి. రిటైడు అయిన కాంట్రాక్టు కార్మికులకు రూ.75,000/- గ్రాట్యూటీ, మరియు పెర్సన్ సదుపాయం కల్పించాలి. కార్మికులకు ప్రభుత్వ సెలవు దినములు, పండగ సెలవు దినములు మరియు వారాంతపు సెలవు దినములు ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని రంగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎ.పి మున్సిపల్ వర్కర్స్ యూనియ జిల్లా ప్రధాన కార్యదర్శి జలగడుగుల కామేష్, క్లాప్ వెహికల్ డ్రైవర్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు తుపాకుల శ్రీను, కార్యదర్శి కళ్యాణం శ్రీను, కార్యదర్శి దలాయ శ్రీను మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.