Listen to this article

మహా అన్న ప్రసాదం ఏర్పాటుచేసిన ఏఎంసీ మాజీ చైర్మన్…. జుక్కల్ ఫిబ్రవరి 25 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా జుక్కల్ జకవర్గం మద్నూర్ మండలం కోడిచెర గ్రామంలో శివ స్వాములు సోమవారం నాడు ఉమాకాంత్ గురుస్వామి ధ్వర్యంలో ఇరుముడి తోని శివ స్వాములు శ్రీశైలం మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి దర్శనం, ఇరుముడిమర్పించడానికి బయలుదేరి వెళ్ళినారు. శివ స్వాములు శివరాత్రి వరకు 21 రోజులు శివ స్వాముల దీక్ష అనంతరం శివరాత్రి రోజున శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో ఇరుముడి సమర్పించి దీక్ష విరమణ చేస్తున్నట్లు గురుస్వామి తెలిపారు. గ్రామంలో శివ స్వాములకు మరియు భక్తులకు మహా అన్న ప్రసాదం ఏఎంసి మాజీ చైర్మన్ సంగమేశ్వర్ ఏర్పాటు చేసినారు. శివ స్వాములు అన్నప్రసాద ఏర్పాటుచేసిన సంగమేశ్వరకు అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు గంగాధర స్వామి , వీరభద్ర స్వామి, సూర్యకాంత్ స్వామి, శివకుమార్, సుధాకర్ మరియు భక్తులు పాల్గొన్నారు