Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. 12వ సీనియర్ స్టేట్ లెవెల్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ టెన్నిస్ బాల్ క్రికెట్ కడప బాలికలు కైవసం. అభినందించిన విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ జయ భాస్కరరావు12వ సీనియర్ స్టేట్ లెవెల్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ టెన్నిస్ బాల్ క్రికెట్ లో స్థానిక విభ ఎరుడైట్ స్కూల్ విద్యార్థిని వేప గుంట హనీ ప్రియాంక కడప జిల్లా బాలికల టీం నందు ఆడి అత్యుత్తమ ప్రదర్శనతో జట్టు విజయానికి కృషి చేసింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 12వ సీనియర్ స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ ను కడప జిల్లా బాలికల జట్టు మొదటి స్థానమును కైవసం చేసుకున్నది ఈ ఛాంపియన్షిప్ కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల టీములు బాలుర బాలికలు టీంలు పాల్గొనగా బాలికల టీము ప్రతిభ కనబరచగా ఫైనల్ మ్యాచ్ నెల్లూరు వర్సెస్ కడప తలపడగా కడప బాలికల టీం ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు ఈ పోటీలలో నందలూరు మండలంలోని విభా ఎరుడైట్ స్కూల్ విద్యార్థిని వేపగుంట హనీ ప్రియాంక ప్రశంస పత్రం మెడల్ లు రాష్ట్రస్థాయి అధికారులు చేత అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం విభ ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ జయ భాస్కర్ రావు మెమొంటో అందజేసి అభినందించారు. స్కూల్లో జరిగిన అభినందన సభ లో డాక్టర్ జయ భాస్కరరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు, క్రీడల్లో కూడా రాణిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి ఏ క్రీడల్లో అయితే ఆసక్తి ఉంటుందోఆ క్రీడల్లో శిక్షణ పొందితే తప్పక విజయం సాధిస్తారని సూచించారు. అభినందన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ చొప్పా సుజాత రెడ్డి, ఫైనాన్స్ ఇంచార్జ్ బి. సుజాతమ్మ, కోఆర్డినేటర్ తుమ్మల అమర్నాథ్ ఉపాధ్యాయ బృందం తదితరులు హనీ ప్రియాంకకు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కె.సుజాత, ఏ లక్ష్మి, టి. పద్మావతి,మాధవి, పఠాన్ షహనాజ్ ఖానమ్, లింట థామస్, నోబియా, లీజా,అభిషేక్,బలరాం, నరసింహారావు,ఎం.శివయ్య, నాయన పల్లి సాయి లలిత్, ఆఫీస్ ఇంచార్జ్ ధార విజయ్ కుమార్, ఫ్లోర్ ఇంచార్జ్ బూదేల ప్రభాకర్, ఆఫీసు సిబ్బంది చంగల్ రాయుడు, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.