

జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 25 : పీఎం కిసాన్ 19 వ విడత రూ. 2000 రూపాయలు నగదును ఈరోజు మధ్యాహ్నం 2.30 కు రైతు సోదరులకు ఖాతాలకు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగినది. తర్లుపాడు మండలంలో 6276 మంది రైతులకు రూ.1.26 కోట్లు వారి అకౌంట్లోకి విడుదల చేసినట్లు మండల వ్యవసాయ అధికారి టి.వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ పీ.ఎం. కిసాన్ కార్యక్రమం 1.12.2018 న ప్రారంభించి ఇప్పటికీ 18 విడతలు పూర్తయి ఈరోజు 19 విడతను విడుదల చేశారని, సంవత్సరంలో విడతకు రూ.2000 చొప్పున 3 విడతలకు రూ.6000 ను ఫిబ్రవరి, మే మరియు అక్టోబర్ మాసాలలో రైతుల ఖాతాలకు నగదు జమ చేయునని వివరించారు. మండలంలోని రైతు సోదరులందరూ ఈ విషయమును గమనించి నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగి ఎవరికైనను నగదు జమ కానీ ఎడల వారు వ్యవసాయ అధికారిని సంప్రదించగలరని కోరారు. ఈ రోజు అన్ని రైతు సేవా కేంద్రాలలో టీవీల ద్వారా ప్రధానమంత్రి చేతుల మీదుగా పీఎం కిసాన్ నిదుల విడుదల ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులకు చూపించడం జరిగినదని తెలిపారు.