

నీటి కోసం అవస్థలు పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు. జనం న్యూస్, ఫిబ్రవరి 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో తర్గునిటీ సర్పర లోపంతో ఇబందులు పడుతున్న గృహిణిలు గత నేల నుంచే మంచి నీటి ఇబంది మొదలయింది. గ్రామంలో చేతి పుంపులు,చేదుకునే బావులు లేక ప్రతి దానికి నీటి అవసరం కావడంతో చాలా ఇబందులను ఎదురుకుంటున్నామని అన్నారు.గ్రామంలో నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో పలు కాలనీవాసులు తమ సొంత డబ్బులతో జెట్ పంపు సింగల్ ఫేస్ మోటర్ ని బాగు చేసుకుంటున్నామని అన్నారు.పలుమార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి కాలం అవ్వడంతో కనీస నీటి సదుపాయం కల్పించకపోతే ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు అని అన్నారు.ఇప్పటికైనా పై అధికారులు స్పందించి నీటి సరఫరా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.లేనియెడల జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు.