Listen to this article

పట్టించుకోని అధికారులు అవస్థలు పడుతున్న కాలనీవాసులు జనం న్యూస్, ఫిబ్రవరి 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో నిండి మొరాయించిన మురికి కాలువలు మురుగునీరు నిలవడంతో కంపో కోడుతున్న కాలనీ, పరిసర ప్రాంతలోని గృహస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు నిలిచి ఉండడంతో అనేక రోగాల బారిన పడి ఆస్పత్రి పాలు ఆవుతున్నామని అన్నారు.కాలనీలో మురికి కాలువలతో పాటు నీటి సరఫరా అక్రమంగా లేదని అన్నారు.నీతి సరఫరా సింగిల్ ఫేస్ మోటర్ చెడిపోగా నీటి ఇబ్బందులు ఎదుర్కోలేక కాలనీలోని ప్రతి ఇంటి నుచి డబ్బులు వేసుకొని మోటారు బాగు చేసుకుంటున్నామని అన్నారు.వారం రోజుల నుంచి సింగిల్ ఫేస్ మోటర్ చెడిపోగా ఆ మోటార్నీ బాగు చేసే నాదుడే కరువయ్యారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తడ్కల్ గ్రామంలోని మురికి కాలువలతో పాటు, మంచినీటి సరఫరాను సక్రమంగా సరఫరా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టి సమ సమస్యలను పరిష్కరించాలని అన్నారు.