Listen to this article

బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించండి. కిసాన్ మోర్చా మండల్ నాయకుడు ఐలయ్య యాదవ్..

జనం న్యూస్ // ఫిబ్రవరి // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం లోని కోరపల్లి గ్రామంలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, పట్టభద్రుల ఇంటింటి కీ, బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి కీ ఓటు వేశి గెలిపించాలని, కోరడం జరిగింది. ప్రచారంలో భాగంగా బిజెపి కిసాన్ మోర్చా మండల నాయకుడు గిరవేన ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.. నిరంతరం విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం,టీచర్ల కోసం, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచి, బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నీ గెలిపించాలని పట్టభద్రుల ఇంటింటికి తిరగడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో, సీనియర్ బిజెపి నాయకులు ఇల్లందుల రాజమల్లు, కిసాన్ మోర్చా మండల నాయకుడు గిరవేన ఐలయ్య యాదవ్, మండల కార్యదర్శి కనవేన సమయ్య, బూత్ అధ్యక్షులు, గుడ్ల రాజకుమార్, దుగ్గల రవి, బండారి శ్రీనివాస్, బైరెడ్డి సమ్మిరెడ్డి, బత్తుల రాజమౌళి, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.