

పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. జనం న్యూస్,ఫిబ్రవరి 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణ స్థలంలో మంగళవారం ధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో (సి ఎఫ్ ఎల్) సంజు,(సి ఎఫ్ ఎల్) విజయ్,(సి ఎఫ్ ఎల్) భూమేష్,లు జాతీయ ఉపాధి హామీ కార్మికులకు జీవనజ్యోతి భీమా యోజన,వార్షిక ప్రీమియం 436 రూపాయలతో రెండు లక్షల జీవిత బీమా పొందవచ్చని అన్నారు. ఈ బీమాను 18 సంవత్సరాలు నిండి, 50 సంవత్సరాల వయసు గల సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకి వర్తిస్తుందని అన్నారు.ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, వార్షిక ప్రీమియం 20 రూపాయలతో రెండు లక్షల రూపాయల ప్రమాద బీమాను పొందవచ్చని అన్నారు. ఈ బీమాను 18 సంవత్సరాల నిండి 70 సంవత్సరాలు వయసు గల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకి వర్తిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మీ బ్యాంకు ఖాతా ద్వారా భీమాను చేయించుకొని తమ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుకోవాలని ఉపాధి హామీ కూలీలను విడమర్చి చెప్పారు.ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని నిరక్షరాస్యతను నిర్మూలించి, చరాశ్యతను పెంచుతూ అక్షరాశులు కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు దాస్, జాతీయ ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.