

జనంన్యూస్ జనవరి 12 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా
ఎలిగేడు మండల కేంద్రంలో ఉన్న అరవి లిటిల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం రోజున స్కూల్ కరస్పాండెంట్ మూర్తి ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు వివిధ రకాలుగా ఉన్న రంగులతో కూడిన విద్యార్ధినిలు సంక్రాంతి పండుగ ముగ్గులు వేసారు చిన్నారులు అయిన విద్యార్ధిని విద్యార్థులతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వివిధ రకాలుగా ఉన్న దుస్తులతో ధరించిన వేశాధారణ ఇతరులను చాలా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కరస్పాండెంట్ మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ కోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మూర్తి తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు