

జనం న్యూస్- ఫిబ్రవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నాన్ కమ్యూనికల్ డిసీజెస్( ఎన్ సి డి) స్పెషల్ ప్రోగ్రాం ని నిర్వహిస్తున్నామని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ డాక్టర్ నగేష్ తెలిపారు. దీనిలో భాగంగా నాగార్జునసాగర్ లోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 30 సంవత్సరములు నిండిన వారికి బీపీ, షుగర్ సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి అంగన్వాడి కేంద్రం పరిధిలో మూడు, నాలుగు రోజులపాటు తమ సిబ్బంది పరీక్షలు నిర్వహించి వివరాలు సేకరిస్తారు అని తెలిపారు. మంగళవారం నాడు హిల్ కాలనీలోని ఒకటవ అంగన్వాడి కేంద్రంలో 30 సంవత్సరములు పైబడిన వారికి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 32 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కమలమ్మ, హెల్త్ అసిస్టెంట్లు గంగా బాయి, సావిత్రి ,లింగయ్య ,తిరుమల చారి ,అంగన్వాడీ టీచర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.