Listen to this article

జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జనం న్యూస్,పార్వతీపురం మన్యం,ఫిబ్రవరి 25( రిపోర్టర్ ప్రభాకర్): జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా నివారించాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ యస్.వి.మాధవ్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లోని రద్దీ ప్రదేశాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు.