Listen to this article

తడ్కల్ పట్టభద్రుల ఓటర్ల భాజపా పార్టీ ఇంచార్జ్ రమేష్ గౌడ్,

జనం న్యూస్,ఫిబ్రవరి 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామ పరిధిలోని 35 మంది పట్టభద్రులను నాలుగు జిల్లాలకు గాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భాజపా పార్టీ నాయకుడు రమేష్ గౌడ్,పలువురు పట్టాభద్రులను కలిసి తమ అమూల్యమైన ఎమ్మెల్సీ ఓటు హక్కును తొలి ప్రాధాన్యతగా భాజపా పార్టీ అభ్యర్థిని ఓటు వేయాలని ఓటరు మహాశయులతో విజ్ఞప్తిని చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,వట్టి మాటలు వల్లించె, ‘శూన్య’ హస్తాలే చూపించె నని అన్నారు.ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటిస్తారని ఆనుకుంటే,ప్రకటన రాకపాయె,విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేస్తారనుకుంటే, రూపాయి విడుదల కాకపాయె,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేస్తూ ప్రకటన చేస్తారనుకుంటే, ఎదురుచూపులే మిగిలినాయె,పెన్షన్ దారులకు బెనిఫిట్లు ఇచ్చేలా మాట్లాడతారు ఆనుకుంటే,మాట రాకపాయె,వరి వేయండి,నీళ్లిస్తామని భరోసా ఇస్తారనుకుంటే, అసలు ఊసెత్తకపాయె, కాంగ్రెస్ పాలన మీద ఆశలు పెట్టుకోవడం తప్పని మరొక్కసారి స్పష్టమాయె, ఎన్నికలలో మాట్లాడిన మాటలన్నీ నీటి మూటలాయే అని అన్నారు.