

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సభా నియమాలకు విరుద్ధంగా అరుపులు, కేకలు, వెర్రిమొర్రి వేషాలతో ప్రతిపక్ష హోదా సాధించాలనుకోవడం జగన్ కుటిల మనస్తత్వానికి నిదర్శనం: పుల్లారావు గతంలో టీడీపీసభ్యుల్ని సభనుంచి గెంటేసి, వైసీపీమూక మాటలు..సైగలతో చంద్రబాబుని మానసికంగా వేధించినా వెనకడుగు వేయక, వెరవక ఆయన ప్రజలపక్షాన మాట్లాడారు పుల్లారావు. ఏ పదవులు ఉండి ప్రజాసంఘాలు, ప్రసార మాధ్యమాలు పాలకుల పనితీరును ప్రజలపక్షాన ప్రశ్నిస్తున్నాయి వాటికున్న విజ్ఞత, చిత్తశుద్ధి జగన్ కు లేకపోవడం సిగ్గుచేటు. పుల్లారావు పట్టుమని 10 నిమిషాలు స్థిమితంగా గవర్నర్ ప్రసంగం వినని వ్యక్తి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం ఆయనలో దాగిఉన్న భయాన్ని సూచిస్తోంది. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రజల పక్షాన గొంతెత్తడానికి హోదాలు గౌరవాలు అడగడం సిగ్గుచేటు అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు తనకు ఇవ్వనిది.రాజ్యాంగబద్ధంగా తనకు దక్కదని తెలిసిన ప్రతిపక్షహోదా కోసం వెంపర్లాడుతున్న జగన్ ను చూసి సొంతపార్టీవారే తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తా 30ఏళ్లు అధికారంలో ఉండేదని గుసగుసలాడుకుంటున్నారు. గతంలో టీడీపీ 23 స్థానాలకే పరిమితమైనా, 5 ఏళ్లలో అసెంబ్లీలో ఆపార్టీ సభ్యులను జగన్ ఆయన సభ్యులు మానసికంగా చిత్రవధ చేసినా వారెవరూ ఇప్పటిలా మితిమీరి వ్యవహరించలేదు. ఒకానొక సందర్భంలో టీడీపీ సభ్యులందరినీ బయటకు గెంటించి మరీ, చంద్రబాబుపై తన పార్టీవారితో జగన్ ముప్పేట దాడిచేయించినా కూడా టీడీపీ అధినేత కించిత్ కూడా వెరవలేదు వెనకడుగు వేయలేదు. వైసీపీసభ్యులు చుట్టూచేరి ఆయన్ని మాటలతో, సైగలతో రెచ్చగొట్టినా ఏమాత్రం సంయమనం కోల్పోకుండా, హుందాగా , గౌరవంగా ప్రజలపక్షాన తనవాణిని బలంగా వినిపించారు చంద్రబాబు. 1984 లోక్ సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయినా టీడీపీ ప్రజలపక్షాన పోరాడాలనే
కర్తవ్యాన్ని విస్మరించలేదు. హోదాను నిర్ణయించే అధికారం స్పీకర్ కు, ముఖ్యమంత్రికి లేదని తెలిసీ కూడా జగన్ కావాలనే గౌరవ చట్టసభల్లో వీధినాటకాలు వేస్తున్నాడని ప్రజలకు అర్థమైంది. ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పాయే అవుతుందన్న భయంతోనే వచ్చాడు. సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడన్నట్టు జగన్ అసెంబ్లీకి వచ్చిపోవడం. మొక్కుబడి చర్యలతో ప్రజల్ని ఇంకా మోసగించవచ్చనే భ్రమల్లో వైసీపీ అధినేత ఉన్నాడు. సభ్యత్వం రద్దై ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ పాయె అవుతుందన్న భయంతోనే జగన్ సభకు వచ్చాడు. ఆ భయాన్ని కప్పిపుచ్చుతూ సభలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. 10 నిమిషాలు స్థిరంగా సభలో కూర్చోని గవర్నర్ ప్రసంగం వినలేని వ్యక్తి, తమ పక్షాన పోరాడతాడా అని ప్రజలు అనుకుంటున్నారు. గతంలో టీడీపీసభ్యులను సభనుంచి గెంటేసి, చంద్రబాబుని వైసీపీమూక మాటలు..సైగలతో మానసికంగా వేధించినా ఆయన వెనకడుగు వేయకుండా ప్రజలపక్షాన మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతాను అనడం జగన్ అసమర్ధత.. ఆయనలోని పలాయనవాదానికి నిదర్శనం. పదవులు హోదా ఉంటేనే ప్రజలకోసం పనిచేస్తాననేవారు ముమ్మాటికీ ప్రజాస్వామ్య వ్యతిరేకులే పదవులు, హోదా ఉంటేనే పనిచేస్తాము ప్రశ్నిస్తాము అనేవారు ముమ్మాటికీ పరాన్నభుక్కులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులే. ఏ హోదా ఉందని ప్రజాసంఘాలు, స్వచంధసంస్థలు ప్రజల పక్షం వహిస్తూ, నిత్యం వారికోసం పనిచేస్తున్నాయి ఏ పదవులు ఉండి ప్రసార మాధ్యమాలు పాలకుల పనితీరును ప్రజలపక్షాన ప్రశ్నిస్తున్నాయి? హోదా గౌరవం ప్రజలు ఇస్తే రావాలిగానీ సభా నియమాలకు విరుద్ధంగా అరుపులు కేకలు వెర్రి మొర్రి వేషాలతో సాధిద్దామనుకోవడం జగన్ కుటిల మనస్తత్వానికి నిదర్శనం అని పుల్లారావు స్పష్టం చేశారు.