

జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి వాంకిడి మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సందర్శించారు. నిజామాబాద్ ,కరీంనగర్, అదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలోని శాసనమండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన రిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఉన్న మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, ర్యాంప్, టాయిలెట్స్ తదితర వసతులను కల్పించాలన్నారు. ఇలాంటి అవాతరాలు లేకుండా ఎన్నికలను సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ రియాజ్ అలీ ను ఆదేశించారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఆర్ఐ అబ్దుల్ మజీద్ , పోలీస్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.