

విద్యా విలువలు తెలిసిన విద్యావేత్త.. కరీంనగర్ గర్వించే ముద్దుబిడ్డగా ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సమాజాభివృద్ధికి బాటలు వేయబోతున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.. పట్టభద్రుల భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గూడెల్లి నవీన్ కుమార్.. జనం న్యూస్ 25 ఫిబ్రవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉటుకూరిని భారీ మెజార్టీతో పట్టభద్రులు గెలిపించాలని గడపగడప తిరుగుతూ విస్తృత ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గూడెల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ. నిస్వార్ధంగా నిబద్ధత, విధేయతతో సమిష్టి కృషితో సమాజం గర్వించే విధంగా అంకితభావంతో తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి దిశ దిశగా నిలుస్తున్నటువంటి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో పట్టభద్రులు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుండే శ్రమను నమ్ముకుని విద్యాసంస్థలను నెలకొల్పి లక్షలాది విద్యా కుసుమాలను తీర్చిదిద్దిన విద్యావేత్త నరేందర్ రెడ్డి అని తెలిపారు. తాను నెలకొల్పిన విద్య సంస్థలలో సుమారు 5000 కుటుంబాలు ప్రత్యేకంగాను 2000 పరోక్షంగాను ఉపాధిని పొందుతున్నారని 50,000 పైచిలుకు విద్యార్థులకు ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు కార్పోరేట్ స్థాయిలో విద్యను విజయ పరంపరను కొనసాగిస్తూ ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను ఉచితంగా అందిస్తూ సమాజ సేవకునిగా గుర్తింపు పొంది విద్యతో పాటు సమాజసేవ చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకొని తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేశారని తెలిపారు. విద్య విలువలు తెలిసిన విద్యావేత్త నరేందర్ రెడ్డిని ఈనెల 27న జరగబోయేటువంటి పట్టభద్రుల ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు క్రమ సంఖ్య రెండులో ( 1) నమోదు చేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుడెల్లి నవీన్ కుమార్ ,తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొడిశాల అర్జున్ గౌడ్, అంబాల జగన్, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు అంబాల యువరాజ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ శనిగరపు సాహూ, అంచనగిరి వెంకటేష్, గొడిశాల వినయ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు