

జనం న్యూస్- ఫిబ్రవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నందు కనపర్తి నాగేంద్రమ్మ (13వ వర్ధంతి) జ్ఞాపకార్థం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా శాసన మండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి,ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విన్నర్ గా గెలిచిన క్లియో మిష్టర్ డిఫ్ఫెన్ డబుల్ ( మిర్యాలగూడ) జట్టుకు, రన్నర్ గా నిలిచిన నాగార్జునసాగర్ జట్లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ క్రీడల మానసిక ఉల్లాసం, శారీరక దారుడ్యానికి దోహదపడతాయని అన్నారు.కనపర్తి నాగేంద్రమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహించటం చాలా సంతోషకరం అని,ఈసందర్భంగావారిని అభినందించారు.తదనంతరం ప్రత్యేకంగా విన్నర్,రన్నర్ జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోకనపర్తి నాగేంద్రమ్మ కుమారులువెంకటరత్నం,సుధాకర్,విద్యాసాగర్, టిఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్ రమేష్ జీ,రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఆనంద్ ప్రతాప్,మరియు టోర్నమెంట్ నిర్వాహకుడు చంద్రమౌళి నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు ఉంగరాల శ్రీను,చిన్ని,రాజగోపాల్ రెడ్డి, నరేందర్,సాగర్ రెడ్డి, నంది కొండ సత్యం,అఖష్,పిటర్,సుల్తాన్ ఖాన్,కస్తురి,జంగారమేష్,రాము, కిరణ్ కుమార్,చందూలాల్,మరియు క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.