Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధిపెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో పట్టభద్రులను కలిసి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వూట్కూరి కి మద్దతుగా సీరియల్ నెంబర్ 2పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దపల్లి గుండేటి ఐలయ్య యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు, పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ముందుకు పోతుందన్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు అనేక ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికను సీఎం రేవంత్ సిద్ధం చేస్తుందన్నారు. గడిచిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అన్నారు. పట్టపద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పట్టభద్రులు సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ వూట్కూరి నరేందర్ రెడ్డి కి మద్దతు ప్రకటించారు అని అన్నారు. జిల్లా మంత్రి శ్రీధర్ బాబు , స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరామణరావు , ఎంపీ వంశీ కృష్ణ నాయకత్వంలో ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో చింత్తిరెడ్డి విజేందర్ రెడ్డి ,కాసారపు శ్రీనివాస్, గాజుల శివశంకర్, అమ్ముల బిక్షపతి, గుండేటి మహేందర్, అట్టేపల్లి రాజు, అట్టేపల్లి మధు, అసరి అనిల్, తోట్ల ఉదయ్, ఈద పవన్ ,కొండల్ రెడ్డి తుమ్మల మల్లయ్య, బండి ఐలయ్య అసరి ఎర్రయ్య, మద్దెల గట్టు యాదవ్ , తుమ్మల సదయ్య, మకోటి లింగయ్య తదితరులు పాల్గొన్నారు…