Listen to this article

జనం న్యూస్/జనవరి 11/కొల్లాపూర్
బిజెపి పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతుగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని కొల్లాపూర్ పట్టణ బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికైన కాడం శ్రీనివాస్ తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ కొల్లాపూర్ పట్టణ బిజెపి అధ్యక్షునిగా తను ఎన్నికయ్యేందుకు కృషి చేసిన నాగర్ కర్నూలు జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు జిల్లా ఉపాధ్యక్షులు సందు రమేష్, శేఖర్ గౌడ్ లకు ఇతర బిజెపి ముఖ్య నాయకులకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.