

జనం న్యూస్ ఫిబ్రవరి 26 మండలం పెన్ పహాడ్:మండల పరిధిలోని నాగులపహాడ్ శివాలయలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో లైటింగ్ కొరకు పదివేల రూపాయల తో కూడిన ఎల్ఈడి లైట్లను నాగుల పహాడ్ గ్రామానికి చెందిన ఎలుక సైదులు మమత దంపతులు శివాలయానికి పదివేల విలువగల లైట్లను ఆలయ మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బహుకరించారు. ఈ సందర్భంగా ఎలుక సైదులు మమత దంపతులు మాట్లాడుతూ నాగులపహాడ్ శివాలయానికి ఎల్ఈడి లైట్లు బహూకరించే అవకాశం రావడం మాకు ఎంతో పుణ్యఫలమని శ్రీ త్రికుంటేశ్వర దేవత మూర్తుల ఆశీర్వాదాలు మాపై ఉండాలని వారు దేవతమూర్తులను కోరుకున్నారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పోగుల జానయ్య గౌడ్, గౌరవ అధ్యక్షులు జానకి రాములు గౌడ్, సంకరమద్ది నిరంజన్ రెడ్డి ,బూరుగు అంజయ్య, సంకరమద్ది దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు