Listen to this article

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్షలు


జనం న్యూస్ ఫిబ్రవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాచండూరు గ్రామంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉదయం నాలుగు గంటలకు అభిషేకాలు నిర్వహించారు మరియు సాయంత్రం సామూహిక సత్యనారాయణ వ్రతాలు ప్రారంభించారు తదనంతరం శివ స్వాములు మాల విరమణ చేశారు రాత్రి సమయంలో 9 గంటలకు శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు ఉపవాస దీక్షలు విరమించారు రాత్రి వేళలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం రాత్రి మల్లన్న చరిత్ర సాంస్కృతిక నాటక కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి మరియు గురువారం రెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని గ్రామ పెద్దలు ప్రజలు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు