Listen to this article

జనం న్యూస్ 27 ఫిబ్రవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఉమారెడ్డి దంపతులు దర్శించుకుని ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఆ దేవుని కోరానన్నారు.  ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రఘునాథరెడ్డి, మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, వివిధ గ్రామాల సీనియర్ నాయకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.