Listen to this article

జనంన్యూస్. 27. నిజామాబాదు. సిరికొండ.ప్రతినిధి. సిరికొండలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి. మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య కు. మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సిరికొండ మండలం బిజెపి నాయకులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఈ కార్యక్రమంలోని సిరికొండ మండల బిజెపి నాయకులు పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు. భారీ మెజారిటీతో గెలిపించి చట్టసభల్లోకి పంపాలని ఓటర్లను అభ్యర్థించారు..తెలంగాణలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో జరిగే ఉపాధ్యాయ. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. సమయం ఉదయం 8 గంటలకు మొదలు అయ్యి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. కరీంనగర్. మెదక్.నిజామాబాద్. అదిలాబాద్. పట్టబద్రుల నియోజకవర్గం లో 3.55.159 మంది ఓటర్లు ఉండగా 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కోసం 27.088 మంది ఉపాధ్యాయులు ఓటు నమోదు చేసుకోగా 15 అభ్యర్థులు బరిలో ఉన్నారు నాలుగు జిల్లాల పరిధిలోని 773 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక మన నిజామాబాద్ జిల్లాలో. 31.571 మంది పట్టభద్రులు ఉన్నారు.
వారి కోసం జిల్లా వ్యాప్తంగా. 48 చేశారు. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గం కు సంబంధించి
3751 టీచర్లు ఓట్లు నమోదు చేసుకున్నారు వారికోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద 81 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు