Listen to this article

జనం న్యూస్ 27ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కె.ఏలియా. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-(యూ) మండలంలోని మహాగాం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూరోజీ బాబా పుణ్యథితిని పురస్కరించుకొని రేపు జరగబోయే 16 సామూహిక వివాహాలకు వెడ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించేందుకు వెడ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ * తనవంతుగా *50 వేల రూపాయల విలువగల నిత్యావసర సరుకులను గ్రామస్తులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావు, మాజీ వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాష్, కనక గంగారాం వెడ్మ ఫౌండేషన్ సభ్యులు కోరేంగ అక్షయ్,మెస్రం నగేష్, గ్రామ పెద్దలు మెస్రం అంబాజీ, మాజీ సర్పంచ్లు రాజేశ్వర్, భూపతి, గ్రామస్తులు లింగు, మాధవ్ రావు, దత్తు విషంరావు, తదితరులు పాల్గొన్నారు.